రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక్‌లో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించి బ్లూ కోట్ సిబ్బంది అతడి ప్రాణాలను కాపాడారు. వివరాలోకి వెళ్తే..సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన గడ్డం నాగరాజు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో కార్గిల్ లేక్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని పలువురు అభినందించారు.