Vemulawada rural | జయవరం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని జయవరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
వేములవాడ రూరల్ : జూన్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని జయవరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి గ్రామానికి చెందిన దానే రమేశ్ (30) తాపీ మేస్త్రీగా పని చేస్తూ వేములవాడలో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం వేములవాడ శివారులోని జయవరం వద్ద అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రమేశ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

