సిరిసిల్ల రూరల్,మార్చి 11: ఎస్సీ వర్గీకరణ అమలుతోపాటు చట్టం వచ్చాకే గ్రూప్స్ పరీక్ష ఫలితాలు(Groups results) విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సావనుపల్లి బాలయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు Group -1, Group-2 ,Group-3 ల తో పాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలన్నారు. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అవునురి రమేష్, గౌరవ అధ్యక్షులు మల్యాల లచ్చన్న, మండల కార్యదర్శి కొమ్మెట దేవయ్య, మహంకాళి రవి, మునిగే శంకర్, మల్లరపు నరేష్, రాజశేఖర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.