వేములవాడ రూరల్ ఏప్రిల్ 29 : సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి శివారులోని కరీంనగర్ – సిరిసిల్ల ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.