సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 2: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని (Brahmotsavam) శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 3 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పంచాహ్నిక ఏక కుండాత్మిక ద్వితీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైనట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 7 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. మయూరగిరి పీఠాధీశులు, శతాధిక ప్రతిష్టాపనాచార్యులు, జ్యోతిష్య, వాస్తు, ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

బ్రహ్మోత్సవాలు ఇలా..
డిసెంబర్ 3: బుధవారం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం
డిసెంబర్ 4: గురువారం శ్రీ లక్ష్మీనారసింహాస్వామి వారి కళ్యాణం, సాయంత్రం తిరువీధి ఉత్సవం (ఊరేగింపు)
డిసెంబర్ 5: శుక్రవారం సామూహిక నవగ్రహ పూజ, కుంకుమార్చన, సాయంత్రం శకటోత్సవం (బండ్లు తిరుగుట)
డిసెంబర్ 6: శనివారం సామూహిక హోమాలు, సాయంత్రం రథోత్సవం
డిసెంబర్ 7: ఆదివారం మహాపూర్ణాహుతి, సాయంత్రం శ్రీపుష్పయాగం
భగవత్ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపా కటాక్షములకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ అష్టకాల మహేందర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ప్రతిరోజు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

