Himanshu | హిమాన్షు కోలుకోవాలని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడి పూజలు
Himanshu | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు త్వరగా కోలుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశాడు.
సిరిసిల్ల టౌన్, జూలై 08: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు త్వరగా కోలుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశాడు. విద్యానగర్ భక్తాంజనేయ స్వామి ఆలయానికి తన కొడుకుతో వెళ్లి పూజలు నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, హిమాన్షు చల్లగా ఉండాలని ప్రార్థించాడు.
హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు. స్పోర్ట్స్ ఇంజురీ కారణంగా ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేరాడు. కాగా, హిమాన్షు గాయపడిన ఉదంతంపై ఆయన తండ్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నా కుమారుడు హిమాన్షు నిన్న సాయంత్రం ఒక చిన్న స్పోర్ట్స్ ఇంజ్యూరీకి గురయ్యాడు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతున్నది. మరికొద్ది రోజుల్లోనే తను మామూలు స్థితికి వచ్చేస్తాడు. హిమాన్షు ఆరోగ్యంపై ఆందోళనతో.. ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్న ప్రతి ఒకరికీ ధన్యవాదాలు’ అని కేటీఆర్ పేరొన్నారు.
త్వరలోనే మీ ముందుకొస్తా : హిమాన్షు
మరోవైపు హిమాన్షు సైతం తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చారు. ‘నిన్న రాత్రి స్పోర్ట్స్ ఇంజ్యూరీ కారణంగా నేను దవాఖానలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను బాగున్నాను. కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నాపై మీకున్న ప్రేమ, మద్దతు, నన్ను అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తాను’ అని హిమాన్షు ట్వీట్ చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

