KTR | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 5 : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ గురువారం మధ్యాహ్నం 1 వ వార్డు పరిధిలోని జ్యోతినగర్ కాలనీవాసులతో భేటీ కానున్నారు. ఆ తరువాత 31, 32, 30, 34, 21 వార్డుల ప్రజలను ఉద్దేశించి జెండా చౌరస్తా, బీవై నగర్ లో ప్రసంగించనున్నారు.
అదేవిధంగా కేటీఆర్ 23, 29, 36, 37 వార్డుల ప్రజలను ఉద్దేశించి వెంకంపేట హనుమాన్ టెంపుల్ చౌరస్తాలో ప్రసంగిస్తారు. సాయంత్రం 11, 24 వార్డుల ప్రజలను ఉద్దేశించి రాజీవ్ నగర్ గాంధీ చౌరస్తాలో ప్రసంగిస్తారు.
అనంతరం 6, 7, 32, 18, 19, 20 వార్డుల ప్రజలను ఉద్దేశించి కొత్త బస్టాండ్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేటీఆర్ ఓటర్లు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అటు నుంచి 6 గంటలకు 2, 13, 14, 27 వార్డుల ప్రజలను ఉద్దేశించి శాంతి నగర్ చౌరస్తాలో ప్రసంగిస్తారు.
కేటీఆర్ ఎన్నికల ప్రచారంకు వస్తుండటంతో సిరిసిల్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు.
Cognizant jobs | కాగ్నిజెంట్లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Chandrahas | చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం .. పోలీస్ కేసు వరకు వెళ్లిన తగాదా