వేములవాడ, జనవరి 4: రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లి శ్రీనివాస్ ఇటీవల జరిగిన రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెమిస్టుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు తాను అంకితభావంతో పనిచేసే అండగా ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ అధ్యక్షుడు, జిల్లా కోశాధికారి రైకన్నపేట శ్రీనివాస్, కెమిస్ట్లు నగుబోతు రమేష్, బోడ్ల అజయ్, సరిపెల్లి మల్లేశం, చీకటిమల్ల శ్రీనివాస్, కొండసాని రాజేష్, గంప రాజేందర్, ప్రశాంత్, రవి, బుచ్చిరెడ్డి, హింగే శ్రీనివాస్, అల్లాడి శ్రీనివాస్ , లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.