సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 7: మైనార్టీ సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఎండీ రషీద్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఎంపీపీ పడిగెల మానస, టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయ న మాట్లాడారు. షాదీ ముబారక్, ఇమాం, మౌజంలకు వేతనాలు, మైనార్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాలలు, స్కాలర్షిప్లు, రుణాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మైనార్టీలు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరా రు. పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఇక్కడ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాల్‌రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత పడిగెల రాజు, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతీ, మోర నిర్మల, సర్పంచ్ అంకారపు అనిత, ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య, బుస్స లింగం, సిలువేరి నర్సయ్య, గుగ్గిళ్ల ఆంజనేయులు, మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల అంజయ్యగౌడ్, సిలువేరి సంజీవ్‌గౌడ్, కొక్కిరాల ఆగంరావు, ఎండీ హమీద్ ఉన్నారు.
మైనార్టీ సెల్ మండల కార్యవర్గం వీరే..
టీఆర్ఎస్ మైనార్టీ సెల్ తంగళ్లపల్లి మండల పూర్తి స్థాయి కార్యవర్గాన్ని మండలాధ్యక్షుడు ఎండీ రషీద్ ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా ఎండీ ఖాసీం, ఎండీ భాషుమియా, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే జాఫర్, కార్యదర్శులుగా ఎండీ జారన్, ఎండీ సలీం, కోశాధికారిగా ఎండీ ఖాన్, ప్రచార కార్యదర్శిగా ఎస్కే రోహన్, సం యుక్త కార్యదర్శిగా ఎండీ షాదుల్, ముఖ్య సలహాదారులుగా ఎం డీ అజీజ్, ఎండీ ఇమామ్, ఎండీ బడేమియా, సభ్యులుగా ఎండీ గౌసొద్దీన్, ఎండీ చాంద్‌మియా, ఎండీ సలీం, ఎండీ షఫీ, ఎండీ ఫిరోజ్, ఎండీ షాదుల్లా, జహింగిర్ ఎన్నికయ్యారు.