JNTU college | సమస్యలు పరిష్కరించాలని జేఎన్టీయూ కళాశాల విద్యార్థుల ఆందోళన
అగ్రహారం జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు మౌలిక వసతులు కల్పించాలని వేములవాడ సిరిసిల్ల - రహదారిపై విద్యార్థులు రాస్తారోకో చేట్టారు.
వేములవాడ రూరల : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు మౌలిక వసతులు కల్పించాలని వేములవాడ సిరిసిల్ల – రహదారిపై విద్యార్థులు రాస్తారోకో చేట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఎన్టీయూ కళాశాలలో మౌలిక వసతులను కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మూడు రోజుల క్రితం విద్యార్థులమంతా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ గోడును కలెక్టర్‌కు విన్న వించు కుచ్చుకున్నామన్నారు.
సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఇలాంటి పురోగతి లేదని వాపోయారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేయగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు విద్యార్థులు బలవంతంగా రోడ్డుపై నుంచి పక్కకు నెట్టు వేశారు. 9 మంది విద్యార్థులను పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

