జగిత్యాల రూరల్, జూలై 28: మహిళల సమస్యల పరిష్కారానికే సర్కారు సఖీ సెంటర్లను ఏ ర్పాటు చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మై నార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బాధిత మహిళలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపు సమీపంలో నిర్మించిన సఖీ సెంటర్‌ను ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు. కేంద్రంలోని గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ, సమైక్య సంఘాల సభ్యులు సఖీ కేంద్రం సేవలపై గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాజిక బాధ్యతతో సాటి మహిళలకు సహకారం అందించాలని సఖీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను కోరారు. ఈ సెంటర్‌కు ప్రహరీ నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సఖీ కేంద్రంలో అన్ని వసతులు కల్పించామని చెప్పారు. సిబ్బంది మెరుగైన సేవలందిస్తూ బాధిత మహిళలకు భరోసానివ్వాలని ఉద్బోధించారు.
జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ, మహిళలకు రక్షణ, భరోసా కల్పించేందుకు సఖీ వన్ స్టాఫ్ కేంద్రం దోహదపడుతుందన్నారు. సెంటర్ ద్వారా అందే ఐదు రకాల సేవలపై విస్తృత ప్రచారం చేయాలని, మహిళల చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. కలెక్టర్ యా స్మిన్ బాషా మాట్లాడుతూ, మహిళలపై అఘాయిత్యాల నివారణకు ప్రభుత్వం నిర్భయ చట్టం అమల్లోకి తెచ్చిందన్నారు. సఖీ సెంటర్లలో బాధిత మహిళలకు కౌన్సెలింగ్, వైద్య సేవలు, న్యాయ సహకారం, పోలీసుల సహకారం అందిస్తారని చెప్పారు. బాధితురాలికి ఐదు రోజుల పాటు వసతి కల్పిస్తారని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో సఖీ కేంద్రాలు నిర్వహిస్తారని తెలిపారు. ఎస్పీ భాసర్ మాట్లాడుతూ, బాధితురాలికి చట్ట పరంగా సహకారం అందించేందుకు సఖీకేంద్రం పనిచేస్తుందని తెలిపారు. అలాగే భరోసా కేంద్రాల ద్వారా కూడా న్యా యం చేస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ బీఎ స్ లత మాట్లాడుతూ, సఖీ కేంద్రం ద్వారా సహకారం పొందిన మహిళలు విజయవంతంగా తమ జీవనాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ వొద్ది శ్రీలత, మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాస్, ప్రకృతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జయశ్రీ పాల్గొన్నారు.