వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి ఏనుగు సంతోష్ రెడ్డి శనివారం సందర్శించారు. న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేయడంతో పరిపాలన మరింత విస్తరించిందన్నారు.
లా కార్యదర్శిగా ఉన్న సమయంలో నేను 50 కోర్టులు మంజూరు చేశాను.
ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరించిందన్నారు. కోర్టు భవనం చిన్నదిగా ఉన్నందున భవనం పై అంతస్తు నిర్మాణానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. తన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని ఆయన హామీనిచ్చారు.
అడిషనల్ జేసీజే కోర్టు మంజూరు చేయాలని, సబ్ డివిజన్ పరిధిలోని కోనరావుపేట మండలాన్ని కూడా ఈ కోర్టు పరిధిలోకి మార్చాలని న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి ప్రేమలత, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్, జూనియర్ సివిల్ జడ్జి ప్రతిక్ సిహాగ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ రెడ్డి, ఏజీపీ సదానందం, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల గౌడ్, కోడిమ్యాల పురుషోత్తం, పిట్టల మనోహర్, నగుబోతు విష్ణు అనిల్ కుమార్, కంటం అంజయ్య , అవదూత రజనీకాంత్, అభిలాష్, బోడ్డు ప్రశాంత్, నాగుల సంపత్, పిల్లి మధు, పారువెళ్ళ శ్రీనివాస్, పంపరి శంకర్, సుజాత, అన్నపూర్ణ ఉన్నారు.