సిరిసిల్ల : రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాసుగౌడ్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవదాసుగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం, రైతుల సహకారంతో సహకార సంఘాన్ని మరింత అభివృద్ది చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వహణతో పాటు రుణమాఫీ తదితర అంశాలకు రైతులు, సభ్యుల సంపూర్ణ సహకారం అందించారన్నారు.
ఈ సందర్భంగా రైతులకు సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, ఏయంసి వైస్ చైర్మన్ బైరి ప్రభాకర్, తంగళ్లపల్లి మండల వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, సురేష్, బండి దేవేందర్, బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్, డైరెక్టర్లు, సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.