DPRO Suspension : రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల (Civil Supplies) అధికారి డీపీఆర్ఓ వీ.శ్రీధర్(V.Sridhar) సస్పెండ్ అయ్యారు. ఆయనను సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూప్‌లో ఓ కార్టూన్‌ను శ్రీధర్ షేర్ చేశారు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ ఆయనను తక్షణమే సస్పెన్షన్ చేశారు.
ఇంతకూ డీపీఆర్ఓ షేర్ చేసిన కార్టూన్లో ఏముందంటే.. ‘డియర్ విప్ ఆది శ్రీనుగారు. సీఎం నా పనితనాన్ని గుర్తించాడు. నేనిక్కడే ఉంటా. అవినీతి అక్రమార్కుల భరతం పడుతా. పైరవీలు నన్ను తొలగించలేవు సిరిసిల్ల కలెక్టర్‌పై చర్యలు లేనట్టే’ అని ఉన్న కార్టూన్ కలెక్టర్ ఆగ్రహానికి కారణమైంది. ఇంకేముంది.. డీపీఆర్‌ఓపై వేటు పడింది.