KCR Cup Cricket Tournament | సిరిసిల్లలో నేటి నుంచి కేసీఆర్ కప్ జిల్లా స్థాయి పోటీలు…!
KCR Cup Cricket Tournament | రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. యువతలను క్రీడల్లో భాగస్వామ్యం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు.
KCR Cup Cricket Tournament | రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 18: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. యువతలను క్రీడల్లో భాగస్వామ్యం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈనెల 10న మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. వారం రోజులపాటు హోరాహోరీగా మండల స్థాయి పోటీలు జరిగాయి. జిల్లాలోని అన్ని గ్రామాల మధ్య క్రికెట్ పోటీలు మండల స్థాయిలో నిర్వహించారు. మున్సిపల్ స్థాయిలోనూ వార్డులవారీగా పోటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50వేలు, ద్వితీయ స్థానం జట్టుకు రూ.25వేలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కు రూ.5వేలు నగదు పురస్కారంతోపాటు కప్ లను, పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు మెడల్స్ అందిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు మండలాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు పోటీల నిర్వహణలో బిజీగా ఉన్నారు. మండలస్థాయి పోటీలు ముగిశాయి.
నేటి నుంచి జిల్లా స్థాయి పోటీలు
మండల, మున్సిపల్ స్థాయిలో గెలిచిన, ఓడిన రెండు జట్లను జిల్లాస్థాయి పోటీలకు ఆహ్వానిస్తున్నారు. రెండు పట్టణాల్లో నాలుగు జట్లు, మండల స్థాయిలో 26 జట్ల మధ్య పోటీ జిల్లా స్థాయిలో నేటి నుంచి మొదలుకానున్నాయి. ఈ పోటీలకు సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులోని మైదానాలు వేదికగా నిలువనున్నాయి. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు భోజన వసతిని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోటీలు వారం రోజులపాటు జరగనున్నాయి.

Kcr Cup Cricket Tournament1
జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లోగోను ఈ నెల 6న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించి, ప్రారంభించారు. ఈ నెల 10 న క్రికెట్ టోర్నమెంట్ మండలాల్లో స్థానిక నేతల తో కలిసి న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వేములవాడ నియోజక వర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డితో పోటీలను ప్రారంభించి, ఉత్సాహం నింపారు. ఇదిలా ఉండగా ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లో మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ లు పోటీలలో పాల్గొని, జోష్ నింపారు.

Kcr Cup Cricket Tournament2
ఈ నెల 25 న ఫైనల్ మ్యాచ్ కు కేటీఆర్
జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీల నిర్వహణకు సిరిసిల్లలో ప్రత్యేక వేదిక (రంగినేని ట్రస్ట్ పక్కన)ను సిద్ధం చేశారు. పోటీలో పాల్గొనే ప్రతి క్రీడాకారులు ఫోన్ నంబరు, ఊరు పేరును సైతం నమోదు చేసుకున్నారు. జిల్లా స్థాయివిజేత జట్టుకు రూ.2లక్షలు, కప్, క్రీడాకారులకు వ్యక్తిగత మెడల్స్, ద్వితీయ బహుమతిగారూ. 1 లక్ష నగదు సెమీఫైనల్ ఓడిన జట్లకు సైతం రూ.50వేల చొప్పున నగదు, షీల్డ్ లు, పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు వ్యక్తిగత మెడల్స్ అందిస్తున్నారు. కాగా, ఈ నెల 25న సిరిసిల్లలో జరిగే ఫైనల్ పోటీలకు కేటీఆర్ హాజరుకానున్నారు. విజేతలకు బహమతులు అందించి, సన్మానించనున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

