సిరిసిల్ల రూరల్, మార్చి 19: తహసిల్దార్ పై అసభ్యకరంగా పోస్ట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తంగళ్ళపల్లి ఎస్సై రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు వివరాలను ఆయన వెల్లడించారు. తంగళ్ళపల్లి మండల తహసీల్దార్ పైన మండలంలోని మండేపెళ్లికి చెందిన నక్క నరేష్ అనే వ్యక్తి అసభ్యకరంగా వాట్సాప్ లో పోస్ట్ పెట్టాడు.
దీంతో తహసీల్దార్ జయంత్ కుమార్ తన మనోభావాలు దెబ్బతినే విధంగా చేశాడని తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. జయంత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నరేష్ మొబైల్ ఫోన్ సీజ్ చేశామన్నారు. ఎవరైనా ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో పెట్టినట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.