మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థులు మిత్రులయ్యారు. జాతీయస్థాయిలో ఒకరికి ఒకరు విమర్శించుకునే కాంగ్రెస్, బీజేపీలు మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం స్నేహ హస్తం అందిపుచ్చుకుంటున్నారు. ప్రజావ్యతిరేకత, పాలమూరు అభివృద్ధిని పట్టించుకోని ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ ఢీకొనడానికి ఏకం కావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న డివిజన్లో బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టడం.. బీజేపీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపని క్యాండెట్లను పెట్టడం ఈ అనుమానాలకు తావిస్తోంది.
ఓ డివిజన్లో ఓ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న బీజేపీ కోసం ఆ సీటును త్యాగం చేయడం కూడా పాత కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు. టికెట్ల కేటాయింపులు అన్యాయం జరిగిన విషయం తెలిసిన డీసీసీ అధ్యక్షుడు ఏకంగా రాజీనామా సమర్పించే వరకు వెళ్లారు. ఏమైందో ఏమో కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తమ టికెట్లను బీజేపీ కోసం అమ్ముకున్నారని అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోయడం కోసం మెరుపు. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణలు కార్పొరేషన్ ఎన్నికల్లో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ మేరకు ఇటు బీజేపీలో అటు కాంగ్రెస్‌లో టికెట్లు కేటాయించిన అభ్యర్థులను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది.
మరోవైపు టికెట్లు ఇచ్చాము తన్నుకు చావండి అంటూ ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అటు బీజేపీ ఎంపీ ప్రచారం చేయకపోవడం ఆ పార్టీ కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తున్నది. ఇదిలా ఉండగా కార్పొరేషన్ డివిజన్లో డబ్బున్న నాయకులకు టికెట్లు దక్కడంతో ఈ రెండు పార్టీలు విచ్చలవిడిగా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మరికొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్నాళ్లుగా గుర్తుకురాని సమస్యలను హడావిడిగా పరిష్కరిస్తూ ఎన్నికల కోడ్ సైతం ఉల్లంఘిస్తున్నారు. పాలమూరు అభివృద్ధిని మరిచిన ఈ రెండు పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి అభివృద్ధి చేస్తామని కొంగ జపం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఏకమైనా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సారథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేషన్లో గట్టి పోటీని ఇస్తున్నది. ఒక్క నేత కోసం రెండు పార్టీలు ఏకమైనా ఆయా డివిజన్లో గులాబీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
కార్పొరేషన్ బరిలో కలిసి..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో ఓటమి ఖరారైన అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయ బద్ధ శత్రువు అయిన బీజేపీతో చేతులు కలిపి నాకు నువ్వు.. నీకు నేను.. అనే రీతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొత్తం 60 డివిజన్లో కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చు కొని పోటీకి దిగాయి. ఈ మేరకు రెండు పార్టీల జాబితాలు చూస్తే అర్థమవుతుంది. ఓ డివిజన్లో బీజేపీ నేత గెలుపు కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. మరోచోట ఆ డివిజన్‌కు సంబంధించిన బలమైన నాయకుడిని ఇతర డివిజన్‌కు బలవంతంగా పంపింది. మరికొందరికి టికెట్లు ఇవ్వకుండా బీజేపీకి అనుకూలంగా అభ్యర్థులను మార్చిం ది.
ఇక బీజేపీ కూడా కార్పొరేషన్లో బలం లేకుండా కాంగ్రెస్ అండతో సీట్లు గెలుచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఒకవేళ మెజారిటీ తగ్గితే బీజేపీ మద్దతు ఇచ్చేందుకు పరస్పర అవగాహన కుదురుచు కున్నట్లు కాంగ్రెస్ నాయకులే బహి రంగంగా చర్చించుకుంటున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కూడా బీజేపీ ఎప్పుడూ సింగిల్ డిజిట్ దాటలేదు. ప్రతి ఎన్నికల్లో కూడా అత్యధికంగా 8 వార్డులు అత్యల్పంగా నాలుగు వార్డులు మాత్రమే గెలుచుకుంది. మెజార్టీ తక్కువైన ప్రతిసారి ఆయా పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకొని సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడంతో బీజేపీ ఉనికిని కోల్పోతున్నది.
బీజేపీ నుంచి కాంగ్రెస్ .. కాంగ్రెస్ నుంచి బీజేపీ
ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు.. ఆ తర్వాత ఓటమిపాలై చివరకు కాంగ్రెస్ చేరి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. ఇక కాంగ్రెస్‌లో ఉన్న డీకే అరుణ గద్వాలలో ఓటమి పాలు కావడంతో బీజేపీలో చేరి ఎంపీ గా గెలిచింది. దీంతో ఇద్దరూ కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్‌గా మారి రెండు పార్టీలను ఒకే పట్టా లపై నడిపిస్తున్నారు. విమర్శలు చేసుకోకుండా కలిసి మెలిసి పనిచేస్తుండడంతో అవకాశవాద రాజకీయాలకు బీజం పడింది.
గతంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్లు మంత్రి పదవి అను భవించి కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన డీకే అరుణ ఆ తర్వాత తెలంగాణ వచ్చాక గద్వాల ప్రజలు చీకొట్టారు. దీంతో ఆమె రాజకీయ ప్రాపకం కోసం బీజేపీలో చేరి 2024లో మహ బూబ్‌నగర్ ఎంపీగా గెలిచింది. అది కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు సపోర్ట్ చేయడంతో స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. ఇక పార్టీలు మారుతూ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆ తర్వాత ఓటమిపాలై కాంగ్రెస్‌లో చేరి 2024లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకేముంది ఇటు ఎమ్మెల్యే అటు ఎంపీ ఇద్దరూ కలిసి పాలమూ రులో మిత్ర రాజకీయాలు నడుపు తున్నారు.
బీఆర్ఎస్ను ఢీకొనలేక ఒక్కటైన పార్టీలు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి కాంగ్రెస్, బీజే పీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నా పాలమూరు అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచింది. తెలంగాణ వచ్చాక ఉద్యమ నేత డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం రూపు రేఖలనే మార్చారు. తాగునీరు, రహదారుల నిర్మాణం ఇతర మౌలిక సదు పాయాలను కల్పించి హైదరాబాద్‌తో పోటీపడే విధం గా తీర్చిదిద్దారు. ఒకసారి ఎమ్మెల్యేగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలమూరు జిల్లా కేంద్రాన్ని మోడల్ జిల్లాగా తీర్చిదిద్దారు. ఇక శ్రీనివాస్‌గౌడ్ అభివృద్ధిలో ముందుకు పోతే తమకు రాజకీయ పుట్టగతులు ఉండవని కాంగ్రెస్, బీజేపీ నేతలు పథకం ప్రకారం ఆయనపై అనేక పుకార్లు వ్యాపింప చేశారు.
2024 ఎన్నికల్లో కూడా శ్రీనివాస్‌గౌడ్‌ను ఓడించ డమే ఏజెండాగా మార్చుకొని రెండు పార్టీలు పోటీ చేసినా ఒ క్కటై తమ లక్ష్యాన్ని నెరవేర్చు కున్నాయి. రెండేళ్లు దాటిన పా లమూరు అభివృద్ధిని అటకెక్కించి పదవులు అనుభవిస్తూ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. దీంతో జిల్లా కేంద్ర ంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తిరిగి బీఆర్ ఎస్ వస్తేనే బాగుండు అని పరిస్థితి ఎక్కడ చూ సినా కనిపి స్తున్నది. దీంతో బీఆర్ఎస్కు ప్రజాధారణ రోజురోజుకూ పెరు గుతూ వస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ ఇక్కడ అధికార పార్టీకి మిత్రపక్షం కావడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదా రులు దాదాపు 50 శాతం గెలవడంతో ఖంగు తిన్న ఈ రెండు పార్టీలు కార్పొరేషన్ ఎ న్నిక ల్లో కారు జోరును తగ్గించేందుకు సిద్ధాంతాలు పక్కకు పెట్టి ఏకమ య్యారు. అయినా మాజీ మంత్రి ఒక్కడే ఈ రెండు పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొంటు న్నారు. మాజీ మంత్రి ధాటికి ఎమ్మెల్యే, ఎంపీలు ప్రచారానికి రావడానికి వెనుకంజ వేయడం కొసమెరుపు. ఏదీ ఏమైనా కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో? త్వరలో తేలనున్నది.