కాంగ్రెస్ సర్కార్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే దిక్కు లేకుండా పోయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలతో రోజుల తరబడి ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువైపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి. కాగా స్వయంగా ఓ కాంగ్రెస్ నేత చేసిన పని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మరోసారి అద్దం పడుతోంది.
ఓ కాంగ్రెస్ నేత 2 నెలలైనా వడ్లు కొనడం లేదని సిబ్బంది ఉండగానే సహకార సంఘ కార్యాలయానికి తాళం వేశాడు. కాంగ్రెస్ నాయకుడు, జిల్లెల్ల మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేశాడు. సెంటర్లో వడ్లు పోసి రెండు నెలలు అవుతున్నా కాంటా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
2నెలలైనా వడ్లు కొనడం లేదని సిబ్బంది ఉండగానే సహకార సంఘ కార్యాలయానికి తాళం వేసిన కాంగ్రెస్ నేత
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసిన కాంగ్రెస్ నాయకుడు, జిల్లెల్ల మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
సెంటర్లో… pic.twitter.com/cDMgwszzUR
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2026