సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్,8 : సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ వినియోగంలో ఉందా? లేదా అని ఆరా తీశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. సీఈసీ విద్యార్థులకు ఎకనామిక్స్ పాఠాలు బోధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యాలయం ఆవరణలో గడ్డి, ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు.