పెద్దపల్లి, మార్చ్ 24( నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీపై కుట్రతో కాళేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లను కిందకి వదిలి గోదావరిని ఎండబెట్టిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో స్వయంగా మాజీ ఎమ్మెల్యే చందర్ దిష్టిబొమ్మ దహనం చేసి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడాన్ని నిరసిస్తూ ‘గోదావరి కన్నీటి గోస’ 198 కిలోమీటర్ల మహాపాదయాత్రను ఆయన పూర్తి చేసి రామగుండంకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.