రుద్రంగి, ఆగస్టు 3: గుండెపోటుతో మృతిచెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. రుద్రంగి (Rudrangi) మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేశ్ అనే యువకుడు 20 రోజుల క్రిత గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లల ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఈ నేపథ్యంలో భూమేశ్ చిన్ననాటి మిత్రులు (2002-03 పదో తరగతి విద్యార్థులు) ఆయన కుటుంబానికి ఎస్ఐ బీ.శ్రీనివాస్ చేతుల మీదుగా రూ.1 లక్ష, 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమేశ్ది నిరుపేద కుటుంబం కావడంతో ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2002- 2003 సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు కాసోజి గణేశ్, సుడిగాపు పరుశురాం, గుగ్గిల తిరుపతి, పులి రాజేశ్, ఫుట్కప్ సురేశ్, మల్లేశ్, రాజు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.