Car | ఎల్లారెడ్డిపేట, జూన్ 26 : ఓ కారు ఇంట్లోకి దూసుకొచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుంచి వస్తున్న ఓ కారు వెంకటాపూర్‌కు చెందిన వాగుమడి ఏకాంబరం రేకుల షెడ్డులోకి దూసుకెళ్లగా.. రేకుల షెడ్డు ధ్వంసమైంది.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్‌కు చెందిన వాగుమడి ఏకాంబరం ఇంట్లో అతని పిల్లలు మహావర్షిణి, చైత్ర టీవీ చూస్తున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుంచి వెంకటాపూర్ వైపు వచ్చిన స్విప్ట్ డిజైర్ కారు వేగంగా ఏకాంబరం ఇంట్లోకి దూసుకెల్లింది.
టీవీ చూస్తున్న పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు చిన్నారులిద్దరినీ బయటకు తీశారు. గతంలో ఓ సారి ఇలాగే ఓ కారు ఇంట్లోకి వస్తే కేసు పెట్టామని అప్పుడు అతడిపై ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ తెలియదని, ప్రస్తుతం మళ్లీ అదే తీరున ఇల్లును ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు పోలీసులను కోరారు.
తమకు న్యాయం జరిగే వరకు కారును ఇంటి నుంచి కదలనిచ్చేది లేదని ఏకాంబరం అతని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి