Maneru vaagu | ఎడారిలా మారిన సిరిసిల్ల మానేరు.. బీఆర్ఎస్వీ నేతల వినూత్న నిరసన
Maneru vaagu | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, జూలై 15 : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని ఆరోపిస్తూ స్థానిక మానేరు వాగులో వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ మాట్లాడుతూ.. గత పది ఏళ్లలో మిడ్ మానేరులోని కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో సిరిసిల్ల మానేరు వాగు నిండుకుండలా ఉండేది అన్నారు. దీంతో భూగర్భ జలాల నీటిమట్టం పెరిగి వ్యవసాయ రంగానికి సాగునీరు, ప్రజలకు అవసరమైన త్రాగునీరు నిత్యం అందుబాటులో ఉందన్నారు.
కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో మిడ్ మానేరు పూర్తిగా ఎండిపోయిందని ఆరోపించారు. దీని కారణంగా సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని కేటీఆర్, హరీశ్ రావు అడిగితే మీ రక్తం పొలాల్లో చల్లండి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును తీవ్ర ఆక్షేపనీయమని విమర్శించారు. వెంటనే కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు అందించాలని, లేనిపక్షంలో కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాచమల్లు మోహన్, గజభింకర్ చిరంజీవి, సోఫియన్, గడ్డం హరీష్, చిన్న వెంకటేష్, గాజుల మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

