సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 12: తంగళ్ళపల్లి మేజర్ గ్రామ పంచాయతీ (Panchayathi Elections) సర్పంచ్‌గా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థిన అంకారపు రవీందర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగుస్తున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో తన మద్దతుదారులు, మండల అధ్యక్షుడు గజ బిం కార్ రాజన్న, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఎంపీపీ పడిగెల మానస, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, పార్టీ శ్రేణులు, గ్రామస్తులతో కలిసి భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు . గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ప్రజలను కలుస్తూ, ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతానని పేర్కొన్నారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కేటీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. పెద్ద మనస్సుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో రిటైర్డ్ ఉద్యోగి తుమ్మ రామస్వామి, పడిగేలా రాజు నృత్యాలు చేస్తూ ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంకారపు అనిత, కొడం సంధ్యారాణి, బీఆర్ఎస్ నేతలు పడిగెల రాజు, బండి జగన్, పర్కపల్లి తిరుపతి, రంగు ప్రసాద్, వెంగళ రమేష్, అనిల్, రామగౌడ్, శేఖర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.