సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 11: సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ నేత, తంగళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు అంకారపు రవీందర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బొల్లారపు రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
ఈ మేరకు కుటుంబ సభ్యులను రవీందర్ పరమర్శించారు. రాజయ్య మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఆయన వెంట బొల్లారం శంకర్, బూడిద స్వామి, కందుకూరి రామ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.