వీర్నపల్లి, సెప్టెంబర్ 04: ఎన్నికల్లో హమీ ఇచ్చిన విధంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీడి కార్మికులు గురువారం నిరసన చేపట్టారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని స్తూపం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రూ.4వేల పింఛన్ ఇస్తామని ప్రకటించిందన్నారు.
ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. 1000 బీడీలకు రూ.800 వేతనం ఇవ్వాలన్నారు. రెండు వందాల బీడీల కట్టింగ్ యాజమాన్యం నిలిపివేయాలని, పీఎఫ్ తో సంబంధం లేకుండా పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన ఆకు, తాంబకు ఇవ్వాలని తెలిపారు. కార్మికుల పిల్లలకు రావాల్సిన ఫెండింగ్ స్కాలర్ షిప్ విడుదల చేయాలన్నారు. ఇక్కడ సూరం పద్మ, సురేష్, సులోచన, లాస్య, నవనీత, లక్ష్మి, సుజాత, రేణుక, లింబవ్వ,తదితరులు పాల్గొన్నారు.