ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 26: అతిగా మద్యం తాగొద్దని ఓ తండ్రి తన కొడుకును మందలించినందుకు మనస్థాపం చెందిన కొడుకు క్షణికావేశంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల జిల్లా బుగ్గరాజ్వేర తండాకు చెందిన గుగులోత్ బాబూరావుకు ముగ్గురు కుమారులున్నారు. చిన్న కుమారుడు గుగులోత్ నవీన్ (25) బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశం వెల్లి మూడు నెలల క్రితం వచ్చాడు. అప్పటి నుంచి పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 21న తన మిత్రుడి పెళ్లి వేడుకకు వెళ్లాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి మద్యం తాగి ఇంటికి చేరుకోగా అతని తండ్రి బాపూరావు ఎందుకు ఎక్కువ తాగావని మళ్లీ గల్ఫ్ వెల్లాలంటే ఆరోగ్యం చెడితే మెడికల్ ఫెయిల్ అవుతావు అని మందలించాడు. తప్పుగా భావించిన నవీన్ క్షణికావేశంలో మనస్థాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. వెంటనే బాధితున్ని మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్‌కు తరలించగా పరిస్థితి విశమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాహుల్‌రెడ్డి తెలిపారు.