కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సోమవారం మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎక్కల దేవి పరశరాములు (42) వెంకట్రావుపేట, బావుసాయిపేట గ్రామల మధ్య గల మూలవాగు వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.