రుద్రంగి : భూగర్భజాలాలు (Underground networks)ఎండిపోవడంతో బోర్లు, బావుల్లో నీరు అడుగం టిపోతున్నాయి. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బండారి మహేష్ తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో వరిపంట వేశాడు. రెండు బోర్లు ఉండగా నీరు సరిపోకపోవడంతో గత ఎడాది తన పొలంలో 5లక్షల రూపాయలతో బాయి తవ్వించాడు. పంట పొట్టదశలో ఉండగా ఈ ఎడాది బోర్లు ఎండిపోయాయి. బాయిలో నీరు అందకపోవడంతో పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీళ్లు తీసుకువచ్చి పొలానికి పెడుతున్నాడు.
ఒక్కో ట్యాంకర్‌కు 1000రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, పంటను కాపాడుకునేందుకు ఇప్పటి వరకు 10 ట్యాంకర్ల నీరు పోసిన సరిపోతలేవన్నారు. గతంలో ఎల్లంపల్లి నుండి కాలువల ద్వారా పుష్కలంగా నీళ్లు రావడంతో భూగర్భజాలాలు అధికంగా ఉండటంతో 4 ఎకరాల్లో పంట పండిందన్నాడు. పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడాల్సివస్తుందని, పరిస్థితి ఇలానే ఉంటే చాలా మంది రైతుల పొలాలు ఎండిపోతాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు మహేష్ కోరారు.