వేములవాడ రూరల్ మార్చి 10 : మద్య మానేరు జలాశయంలో(Maner Reservoir) నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో చేపలు పట్టుకునేందుకు మత్స్యకారుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని బ్యాక్ వాటర్ లో గల చేపలను పట్టుకునేందుకు వేములవాడ పట్టణవ ముదిరాజ్ కులస్తులు వెళ్లగా, ఇది మా పరిధిలోకే వస్తుంది అంటూ సంకపల్లి గ్రామానికి చెందిన కులస్తులు ఆందోళన దిగారు. అయితే రెడ్డిపురం క్వారీ సమీపంలో గత మూడు సంవత్సరాలుగా తామే పట్టుకుంటున్నామని ముదిరాజ్ కుల సంఘ పెద్ద పండు తెలిపారు.
ఇప్పటికే దీనిపై మాకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆశ్రయించామని వారు తెలిపారు. అయితే సంకేపల్లి భూములన్నీ ఇప్పటికే మద్య మానేరులో కోల్పోయామని ఉన్న కాస్త ఉపాధి దీనితోనే ఎల్లోదిస్తున్నామని, మా భూముల్లో మీరెలా పడతారు అంటూ వేములవాడ వాసులను అడ్డుకోవడంతో గొడవ తీవ్రస్థాయికి చేరింది. జిల్లా ఫిషరీష్ అధికారి సౌజన్య ఇరువర్గాలను శాంతింప చేసి హద్దులపై అధికారులతో మాట్లాడి నిర్ణయిస్తానని మూడు రోజుల గడువు కోరింది. అధికారి సూచన మేరకు ఇరువర్గాలు అక్కడి నుండి వెళ్లిపోయాయి.