ఎల్లారెడ్డిపేట, జనవరి 31: ఎల్లారెడ్డి మండలంలో (Yellareddypet) విషాదం చోటుచేసుకున్నది. మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో వంటచేస్తూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో మృతిచెందారు. ఈ నెల 19న బొమ్మ కంటి పద్మ (82) తన ఇంట్లో వంట చేస్తుండగా చీర కొంగుకు మంటలంటుకున్నాయి. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు. దీంతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.