Vemulawada |వేములవాడ, జూన్ 13: మరదలు మృతి చెందిందని అంత్యక్రియలకు వచ్చిన భావ కుప్పకూలి మృతి చెందిన సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ పట్టణం సాయినగర్‌లోని బోనాల వీధికి చెందిన కోల రామ్మూర్తి సోదరి నరసవ్వ (50) గురువారం నాడు అనారోగ్యంతో మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న మృతిరాలి బావ పసుల కిషన్ (70) గురువారం రాత్రి కరీంనగర్ నుంచి వేములవాడకు వచ్చాడు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఇంటికొచ్చిన బంధువులు ఏడుస్తుండటంతో కిషన్ వారందరినీ ఓదార్చాడు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన కిషన్ ఒక్కసారిగా కుప్పకూలాడు. కంగారుపడిపోయిన బంధువులు కిషన్‌ను హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించాడని తెలిపారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.