ఎటుచూసినా కరువు ఛాయలే
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వానకాలం సీజన్ మొదలై నెలన్నర గడుస్తున్నా.. వానలు జాడలేకుండా పోయాయి. ఈ పాటికి జలకళలాడాల్సిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. వర్షాలే లేక భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటుతున్నాయి. బోర్లు, వ్యవసాయబావులు వట్టిపోతున్నాయి. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకపోవడంతో కాలువలు నిరుపయోగంగా మారాయి.
- ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు
- వానకాలం సీజన్ మొదలైన నెలన్నరదాటినా జాడలేని వానలు
- సర్కారు ముందుచూపులేక తంటాలు
- అడుగంటిన ప్రాజెక్టులు, చెరువులు
- ఏ ఊరిలో చూసినా బీళ్లుగా భూములు
- ముదిరిన నార్లు.. పొలాల్లో నెర్రెలు
- వాడిపోతున్న పత్తి మొలకలు
- కంటతడిపెడుతున్న అన్నదాతలు
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వానకాలం సీజన్ మొదలై నెలన్నర గడుస్తున్నా.. వానలు జాడలేకుండా పోయాయి. ఈ పాటికి జలకళలాడాల్సిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. వర్షాలే లేక భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటుతున్నాయి. బోర్లు, వ్యవసాయబావులు వట్టిపోతున్నాయి. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకపోవడంతో కాలువలు నిరుపయోగంగా మారాయి.

ఫలితంగా ఉమ్మడి జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఏ ఊరిలో చూసినా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. తొలకరి మురిపెంతో అక్కడక్కడ నార్లు పోసినా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. నాటు వేసిన పొలాలు నెర్రెలు బారుతున్నాయి. నాటిన పత్తి విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి.

మొలకెత్తిన మొక్కలు వాడిపోతున్నాయి. ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నా సర్కారు మందుచూపు లేకపోవడం.. కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే ఆలోచన చేయకపోవడంతోనే సాగునీటి గోస తీవ్రమైంది. ఎన్నో ఆశలతో సేద్యానికి సిద్ధమైన రైతన్న.. ఈ సారి కాడి ఎత్తేయాల్సిన దుస్థితి వచ్చింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్


Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

