Rahul Gandhi birthday | హుజురాబాద్/హుజురాబాద్ రూరల్, జూన్ 18 : దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.
అనంతరం ప్రణవ్ బాబు మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకొని తెలంగాణలో కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని అన్నారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ,మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, యువజన విభాగం, మహిళా అధ్యక్షురాలు, యువజన కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సేవాదళ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.