PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 2:క్యాంటీన్‌కు వచ్చే కస్టమర్లకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణ శ్రీ తో కలిసి కలెక్టర్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ యూనిట్ల స్థాపనకు సహకారం అందిస్తుందని, ఇందులో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో క్యాంటీన్ నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని వివరించారు.
క్యాంటీన్‌కి వచ్చే ప్రభుత్వ అధికారులు సిబ్బంది, ఇతర కస్టమర్లకు నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలన్నారు. క్యాంటీన్ పరిసరాలలో శుభ్రంగా ఉంచడం చాలా కీలకమని పేర్కొన్నారు. మహిళలు వ్యాపార దృక్పథంతో క్యాంటీన్ నడుపుతూ మంచి లాభాల సంపాదించాలని, అదే సమయంలో నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో ఎం కాళిందిని, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.