Collector Koya Sriharsha | పెద్దపల్లి, ఆగస్టు25: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టర్ ప్రజల వద్ద దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని వినతి..
మంథని మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల(ఎస్ఎంస్) హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొరెంకల సురేశ్ కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం అందజేశారు. గత రెండేళ్లగా వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తూ ఎస్సీ బాలికల (ఎస్ఎంఎస్) హాస్టల్లో హాస్టల్ విద్యార్థుల సంఖ్యను పెంచకుండా నిర్లక్షం వహిస్తున్నారని, హాస్టల్ ప్రవేశం పొందిన విద్యార్థులను వార్డెన్ ఇష్టమైన రీతిలో తిట్టడం వల్ల గత సంవత్సరంలో పలువురు విద్యార్థులు టీసీలు తీసుకొని వేరే హాస్టల్‌కు వెళ్లారని కలెక్టర్‌కు వివరించారు. విధుల పట్ల నిర్లక్షంగా వ్వవహారిస్తున్న హాస్టల్ వార్డెన్, సంబంధిత అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించనట్లు సురేశ్ తెలిపారు.