వెల్గటూర్, నవంబర్ 21: ‘నేను మీ బిడ్డను. ఎన్నో ఏండ్ల నుంచి మీ సేవలోనే ఉన్నా. మీకు ఆపదొస్తే ఆదుకుంటా. కష్టమొస్తే తోడుగా నిలుస్తానని’ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంతి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు భరోసానిచ్చారు. మంగళ వారం వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన అమాత్యుడికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. కోటిలింగాలలో మిగిలిన పనులన్నీ చేస్తానని, సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలకు తనకు మధ్య దాపరికాలు ఉండవద్దని, మధ్యవర్తులు, ఫైరవీలకు తావు లేకుండా నేరుగా తనకు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పాలని సూచించారు. మిమ్మల్ని తనకు దూరం చేయడంలో కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని, అలాంటి వారిని దూరం పెట్టి నేరుగా తననే సంప్రదించాలని సూచించారు. మరొకసారి ఆశీర్వదించాలని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
ఈ సందర్భంగా కోటిలింగాల అర్చకుడు సంజీవ్ శర్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 100 మంది పద్మశాలి నాయకులు బీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసరి సత్తయ్య, దాసరి భరత్, పరుష రమేశ్, దాసరి కోట య్య, రమేశ్, రాజ్‌కుమార్, ఎలగం గంగయ్య, ఎలుగం మల్లేశ్ం, రాజ్‌కుమార్, చింతకింది రాజేశ్, మహేశ్, శంకరయ్య, అడగంట్ల తిరుపతి, రాజయ్య, నక్క రాయలింగు, జోగు రాజయ్య, ఎన్నం ఆశయ్య, రాపాక గంగయ్య, కోటయ్య, రామయ్య, రాపాక కోటయ్య, దాసరి శ్రీనివాస్ ఉన్నారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పర్ష కోటయ్య, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సర్పంచ్ నక్క మౌనిక-రవితేజ, బోడకుంటి రమేశ్, ఎంపీటీసీ రాజేశ్వరి ఉన్నారు.