‘కాంగ్రెస్ వస్తే కరెంట్ కాటకలుస్తది. తెలంగాణ మళ్లీ అంధకారమైతది. ఎవుసానికి మూడు గంటలే ఇస్తామని ఆ పార్టీ నాయకులు బాజాప్తా చెబుతున్నరు. మీకు మూడు గంటలు ఇచ్చే పార్టీ కావాలా..? 24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా
నేను మీ బిడ్డను. ఎన్నో ఏండ్ల నుంచి మీ సేవలోనే ఉన్నా. మీకు ఆపదొస్తే ఆదుకుంటా. కష్టమొస్తే తోడుగా నిలుస్తానని’ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంతి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు భరోసానిచ్చారు.