Jagityal | మల్లాపూర్, జూన్ 23: మండలంలోని మొగిలిపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు తోకల రాజు, వేంపల్లి ప్రభుత్వ పాఠశాలలో గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై గెల్లె మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులతో కలిసి వేర్వురుగా విద్యార్థులకు సరిపడ నోట్స్, తదితర స్టేషనరీ సామాగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామాని తెలిపారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు హరిబాబు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.