సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 30 : మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం హెల్పర్స్, వరర్స్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ధర్నాలకు దిగారు. మెనూ చార్జీలు పెంచకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జూలై 10వ తేదీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ క్యాంపు కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.