Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 12 : కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పిల్లి రవియాదవ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ వరకు ర్యాలీ తీసి, రోడ్డుపై ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పిల్లి రవి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాలలో ప్రజాకార్మిక వ్యతిరేఖ విధానాలు ముందుకు తీసుకువచ్చిందని, 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వర్గాన్ని బలిచ్చే లోబర్ కోడ్లు తీసుకువచ్చిందని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ అనుసరిస్తున్న ప్రజాకార్మిక వ్యతిరేఖ విధానాలను మార్చుకోకపోతే రానున్న రోజులల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ చొప్పరి శ్రీనివాస్, హమాలీ మండల కార్యదర్శి తడిగొప్పుల రాజయ్య, జీపీ కార్మికులు మహంకాళి కొమురయ్య, దాసారపు శంకర్, కండె సదయ్య, మంత్రి రవి, ఆర్ రమేష్, చొప్పరి ఐలయ్య, మరో 50 మంది కార్మికులు పాల్గొన్నారు.