Strict action | సారంగాపూర్, జులై 9: ఆలయ అధికారుల పై దాడులు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని దుబ్బ రాజన్న ఆలయంలో బుధవారం ఆలయ అధికారులు, సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలం కార్య నిర్వాహణాధికారిపై మంగళవారం జరిగిన దాడి విషయములో తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేవాలయ భూములు ఆక్రమించుకున్న వారి నుండి భూములను వెనక్కి తీసుకునేలా కఠినమైన చట్టాలు చేయుటకు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి అనూష, ఉద్యోగస్తులు, అర్చకులు సంఘీభావం తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.