గోదావరిఖని, ఏప్రిల్ 25: సింగరేణి వ్యాప్తంగా ఉన్న అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని టీబీజీకేస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాపాడుకోవడంతోపాటు కార్మికులు, వారి కుటుం బ సభ్యుల సంక్షేమ, అభివృద్ధే లక్ష్యం గా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పనిచేస్తుందని స్పష్టం చేశారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వరంగ సంస్థల ఉనికి ప్రమాదకరంగా మారిందని, సింగరేణి లో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజు కూ తగ్గిపోతున్నదని, కాంట్రాక్ట్ కార్మికుల సం ఖ్య పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ వేల కోట్ల లాభాలను సంపాదించి దేశప్రగతికి దోహదపడుతుంటే.. గని కార్మికుల బతుకులు మాత్రం అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయని ఆవేదన చెందారు. కార్మికుల కోసం పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని, సంస్థ ఉనికి ప్రమాదంగా ఉన్న బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొనవద్దని స్పష్టం చేశారు. సంస్థ లో అమలు చేస్తున్న మెడికల్ రిఫరల్ విధానాన్ని సమీక్షించాలని, అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చెల్లుబాటు అయ్యేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని, రామగుండం, బెల్లంపల్లి, కొత్తగూడెం రీజియన్‌లోని కార్మిక కుటుంబాలకు తగిన రక్షిత మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బొగ్గు కొనుగోలు ద్వారా, థర్మల్, సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా చెల్లించాల్సిన బకాయి వివరాలను వెల్లడించి వెంటనే చెల్లించాలన్నారు. ధర్నాలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, వడ్డెపల్లి శంకర్, చెరుకు ప్రభాకర్‌రెడ్డి, పింగిల్ సంపత్‌రెడ్డి, ఎల్ వెంకటేశ్, చెల్పూరి సతీశ్, మొదుంపల్లి రాజేశం, తస్యం, బేతి చంద్రయ్య, పాషం శ్రీనివాస్‌రెడ్డి, చెలుకలపల్లి శ్రీనివాస్, రమేశ్, దేట శేషగిరి, వాసర్ల జోసఫ్, జనగామ మల్లేశ్, ఉప్పులేటి తిరుపతి, రాజు, మల్లేశ్, బొగ్గుల సాయి, అప్సర్‌పాష, సాయి చరణ్, వెంకటేశ్, దాసరి శ్రీనివాస్, రమేశ్, అబ్దుల్ని, వెంకట్‌రెడ్డి, నరేశ్, భాస్కర్, దేవేందర్, శషాంక్, పర్లపల్లి అభిషేక్, మార్క వెంకటస్వామి ఉన్నారు.