Private schools | వేములవాడ, జూన్ 7: వేములవాడలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నగదు దండుకుంటూ దోపిడీ పాల్పడుతున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు పోతు అనిల్ కుమార్ ఆరోపించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాల పేరుతో రూ.5వేల నుండి రూ.12 వేల వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి దండుకుంటున్నాయని ఆరోపించారు.
మరికొన్ని పాఠశాలలు బుక్ సెల్లర్స్ తో కుముక్కై విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. అనుమతి లేని పాఠశాలలు కూడా పుట్టగొడుగుల్లా వచ్చాయని, వీటన్నిటిపైవ దృష్టి సారించాల్సిన విద్యా శాఖ ఇంకా నిద్రమత్తులోనే ఉందని ఎద్దేవా చేశారు. జిల్లా యంత్రాంగం దృష్టి సారించి వెంటనే తనిఖీలు నిర్వహించి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని కాపాడాలని ఆయన కోరారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తామని ఆయన హెచ్చరించారు.