Jagityal | జగిత్యాల, జూన్ 19 : రాష్టంలో ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షులు గుంటి జగదీశ్వర్ కోరారు. చివాలయంలో గుంటి జగదీశ్వర్ సీఎం సలహాదారు నరేందర్ రెడ్డిని గురువారం కలిసి అర్చకుల సమస్యల గురించి వివరించారు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. జగదీశ్వర్ వెంట రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్, రాష్ట్ర ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, ఎస్ ఉమా మహేశ్వర్ తదితరులు ఉన్నారు.