Siricilla | కోనరావుపేట, జూలై 12: స్వగ్రామంపై మమకారం తో మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ రూ.లక్ష విలువ గల శవపెటిక (ఫీజర్ బాక్స్)ను తన తల్లి చెన్నమనేని పద్మావతి, వదిన చెన్నమనేని రమాదేవి జ్ఞాపకర్థం అందజేశారు. గ్రామంలో ఎవరు మృతి చెందినా ఈ ఫీజర్ బాక్స్ ఉపయోగపడుతుందని చేప్పారు.
భవిష్యత్లో కూడా మరింతగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఫీజర్ బాక్స్ ని అందజేశారు.