సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 17: స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార సంఘాల్లో రిజర్వేషన్లు కల్పించారని, ఏఎంసీలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికల్లో రిజర్వేషన్లు లేక ఉన్నతవర్గాలకు మాత్రమే పాలకవర్గాల్లో ప్రాధాన్యత ఉండేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. గతంలో సిరిసిల్ల సెస్‌లో ఉన్న 11డైరెక్టర్ స్థానాలను మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని పెరిగిన మండలాలతో పాటు జనాభా ప్రాతిపదికన పాలనా సౌలభ్యం కోసం 15కు పెంచారని చెప్పారు.
రైతు సమస్యల సత్వర పరిష్కారానికి ఇది ఎంతో దోహదపడుతుందన్నా రు. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాల్లో మంత్రి కేటీఆర్ బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నాలుగు స్థానాలు, వేములవాడ పరిధిలో నాలుగు స్థానాలు మొ త్తం 58శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించి పెద్దపీఠ వేశారన్నారు. బీసీల పార్టీ అని ప్రగల్బాలు పలికే బీజేపీ సెస్ 15స్థానాల్లో కేవలం ఐదు డైరెక్టర్ స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించిందని విమర్శించారు. మంత్రి కేటీఆర్ నేతృత్వం లో సిరిసిల్లలోని రెండు డైరెక్టర్ స్థానాలను బీసీలకు కేటాయించామని, అందులోనూ మెజార్టీ సామాజికవర్గమైన పద్మశాలీలకే అవకాశం క ల్పించామని పేర్కొన్నారు. సిరిసిల్ల డైరెక్టర్ స్థా నాల్లో రెండింటిలో ఒక స్థానంలో బీజేపీ ఓసీల కు కేటాయించడంలో బీసీలపై వారికున్న కపటప్రేమ స్పష్టమవుతున్నదన్నారు. మంత్రి కేటీఆర్ మద్దతుతో సెస్ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు 15మందిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సెస్ ఎన్నికల్లో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ అధిష్ఠానం సూచించిన అభ్యర్థులకు పోటీగా పార్టీ నాయకులు నామినేషన్లు వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. జిల్లాలో ని గంభీరావుపేట మండలం నుంచి నామినేషన్ వేసిన కొక్కు దేవేందర్‌యాదవ్, వీర్నపల్లి మం డలం నుంచి నామినేషన్ వేసిన భూక్యా సంతోష్‌నాయక్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సస్పెన్షన్‌కు గురైన వారి వెంట ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్బీఎస్ ముస్తాబాద్ మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు, బీఆర్ఎస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, తంగళ్లపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు, ప్యా క్స్ చైర్మన్ బండి దేవదాస్, ఆర్బీఎస్ వీర్నపల్లి మండలాధ్యక్షుడు ఎడ్ల సాగర్, బంజారాసేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోతు సురేశ్‌నాయక్, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్, జక్కుల నాగరాజుయాదవ్ నాయకులు పాల్గొన్నారు.