జమ్మికుంట రూరల్, మే 16: డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలను పాటించాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు తులసీదాస్ సూచించారు. మండలంలోని వావిలాల గ్రామంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం వ్యాధి నివారణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు మాట్లాడుతూ.. ఏడిస్ దోమ కాటుతో డెంగ్యూ వస్తుందని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్‌రెడ్డి, సూపర్వైజర్లు స్వరూప, సాంబయ్య, ఐసీడీఎస్ సీడీపీవో భాగ్యలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్‌తోపాటు తదితరులున్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, మే 16: జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో సోమవారం ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. పీహెచ్సీ వైద్యురాలు జ్యోత్స్న డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామస్తులకు వివరించారు. ఇక్కడ ఎంపీడీవో విజయలక్ష్మి, వైద్యురాలు సుష్మ, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.