హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తేతెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సీఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం అందజేశారు.