‘పెద్ది’ ఆరోగ్యంపై హరీశ్‌రావు ఆరా.. మూడ్రోజులుగా దవాఖానకు వెళ్లి పర్యవేక్షణ
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్‌రావు మూడ్రోజులుగా నిరంతరం పర్యవేక్షిస్తూ వారి కుటుంబానికి అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్‌రావు మూడ్రోజులుగా నిరంతరం పర్యవేక్షిస్తూ వారి కుటుంబానికి అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు.. ఆదివారం హనుమకొండలోని దవాఖానకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో కలిసి వెళ్లి పరిస్థితులను సమీక్షించిన హరీశ్‌రావు, మెరుగైన వైద్యం కోసం పెద్దిని హైదరాబాద్ యశోదకు తరలించే వరకూ వెన్నంటే ఉన్నారు.
సోమవారం పార్టీ అధినేత కేసీఆర్ పెద్దిని పరామర్శించేందుకు రాగా, ఆయన కంటే ముందే హరీశ్‌రావు దవాఖానకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతోపాటు సరైన వైద్యం అందించేలా వైద్యులను అప్రమత్తం చేశారు. మంగళవారం కూడా హరీశ్‌రావు యశోద దవాఖానకు వెళ్లి ఐసీయూలో ఉన్న సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఆయనకు అందిస్తున్న చికిత్స, కోలుకుంటున్న తీరుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ మంత్రుల పరామర్శ
యశోద దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. అనంతరం పెద్ది కుటుం బ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

